తెలుసా ....
posted on Oct 11, 2019
తెలుసా ....
తెలుసా ....
గడిచిన కాలానికి అడిగిన ప్రశ్న
తడిచిన కనులలో దాగిన ప్రశ్న
నడిచిన గమ్యానికి వేసిన అడుగే
పడిలేచే జీవితమే ఓ .. గెలుపు ..నా మలుపుకు నిలిచిన ఈ చిరునవ్వే ఓ ...బదులు ...
తెలుసా ...
పూలను చూసిన క్షణం మైమరచిన మనసా
పలికే తీరే అడిగే నా మదిలోని కోరిక
పడిలేచే అలలకు ఎంతో దూరం మనసా
పరిమళించిన పుష్పంతోనే మాటాడిన క్షణమే మధురమైన క్షణము ...
స్మరణను వదలకు మనసా
లోకం తీరే వేరే ... ఐనా
నా లోన దగ్గున్న లోకం ఓ అద్భుతమే ఓ మనసా తెలుసా ..
అది నీకే వదిలేసా నా మనసా !!!
రాదేది తలచిన క్షణం
పోదేది విడిచిన క్షణం
ఎదే అన్నిటికీ మరువని క్షణం
మదే మరువదు ఏ క్షణం !!
- Divya Chevuri