చదువు
posted on Oct 8, 2020
చదువు
చదవాలి చదవాలి
చదవాల్సిన దశలో
చదువు జీవితానికి
వెలుగు ఇచ్చే జ్ఞానజ్యోతి
సమయం సద్వినియోగం
జ్ఞాన సముపార్జన మార్గం
చదువుపై మనసులో
మమకారం పెంచాలి
నీవనుకున్న లక్ష్యం చేరాలి
తల్లిదండ్రులు కష్టాలను
అనునిత్యం నెమరేస్తూ
వారికి సంతోషం పంచేట్టు
సాధనతో చదవాలి
కృషితో నాస్తి దుర్భిక్షం
అన్నట్లు
నిరంతరం చదువే శ్వాసగా ధ్యాసగా
సాగితేనే విజయం
విజయంతో శిఖరమై జీవితాన గెలవాలి
జి. మంజుల