ఆడపిల్లనని

ఆడపిల్లనని

 

అమ్మ నాన్న
బాధపడకండి నేనాడపిల్లననీ
నేను మనిషిననీ నమ్మీ
బడికంపిన నమ్మకాన్ని
వమ్ముచేయను
మీ సంతోషం దాగున్నది
నా విజయంలోనని తెలుసు
చదువుతానమ్మ
ఆడపిల్లలందరూ గర్వించేలా
మిమ్మల్ని చూసీ గర్వపడేలా
సరస్వతీ కటాక్షం నాకందించిన దేవుళ్ళు మీరు
చదువే వెలుగని తెలిపిన
మీకెపుడు పాదాభివందనం

 

బి. అనూష