మనిషి ధర్మం

 

కడుపు వేసే కేకలే ఆకలి
జానెడు పొట్ట
ఆరడుగుల మనిషినైనా
అరిచేలా చేస్తుంది
గుప్పెడు ముద్దను చూసిన
గుటకలు వేయిస్తుంది
పెద్దా చిన్నా తేడా లేదు 
పేద ధనిక భేదం లేదు
కదిలే రోజులో
కడుపు డొక్కనంటుకుని 
ఆకలి బాధను తట్టుకోలేక
చేతులను అడ్డుపెట్టుకుని
విలపించే కేకలు వినిన
ఆకలిగొన్న వారికి
గుప్పెడు మెతుకులు
దప్పికగొన్న వారికి 
గుక్కెడు నీళ్ళు
అందించడం మనిషి ధర్మం
ఆ ధర్మమే మానవత్వం

 

రచన : వెంకు సనాతని