Home » Vegetarian » Aloo Batani Pulao


 

ఆలూ బటానీ పులావ్

కావాల్సిన పదార్ధాలు:

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

ఆలూ (చెక్కు తీసినవి) - ఒకటి

బటానీ - అర కప్పు

బిరియానీ ఆకు - ఒకటి

లవంగాలు - నాలుగు

యాలకులు - అయిదు

షాహీ జీరా - అర టేబుల్ స్పూన్

దాల్చిన చెక్క - ఒకటి

మీడియం సైజు ఉల్లిపాయ - ఒకటి

అల్లం వెల్లులి ముద్ద - అర టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

పచ్చిమిర్చి - రెండు

నానబెట్టిన బాస్మతి బియ్యం - ఒక కప్పు

పుదీనా తరుగు – కొద్దిగా

కొత్తిమీర తరుగు – కొద్దిగా

నీళ్ళు - 1.1/4 కప్పు

తయారీ విధానం:

కుక్కర్లో నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు , యాలకులు, లవంగాలు, షాహీజీరా, వేసి వేపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని అందులోనే ఆలూ ముక్కలు కూడా వేసి ఇవి కూడా లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి. ఆలూ వేగిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపాలి. తర్వాత ఎసరు నీళ్ళు పోసి అందులో పచ్చిమిర్చి, ఉప్పు, బటానీ వేసి హై ఫ్లేమ్ మీద ఎసరు మరగనివ్వాలి. మరుగుతున్న ఎసరులోకడిగి నానబెట్టిన బాస్మతి బియ్యం కొత్తిమీర పుదీనా వేసి కలిపి మూత పెట్టి 1 విసిల్ రానిచ్చి స్టవ్ ఆపాలి. స్టవ్ ఆపిన వెంటనే దింపకుండా కుక్కర్‌ లో ఆవిరి పోయేదాక ఉంచి తర్వాత కుక్కర్ మూత తీసి రైతా లేదా స్పైసీ పనీర్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకేందుకు ఆలస్యం... ఈ వర్షాకాలంలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.


Related Recipes

Vegetarian

ఆలు బొండా!

Vegetarian

ఆలు దమ్ బిర్యానీ

Vegetarian

ఆలు వంకాయ ఫ్రై!

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Aloo Batani Pulao

Vegetarian

Aloo Curry And Tomato Rasam

Vegetarian

Aloo Paratha

Vegetarian

Spicy Aloo Gravy