ఆలు వంకాయ ఫ్రై!
కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన బంగాళాదుంపలు - పావు కిలో
చిన్న ముక్కలుగా తరిగిన వంకాయలు - పావు కిలో
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 2
తాళింపు దినుసులు - 2 టేబుల్ స్పూన్స్
కారం - 1 టేబుల్ స్పూన్
కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు - 5
పసుపు - అర టీ స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి సరిపడా
దాల్చిన చెక్క పొడి - పావు టీ స్పూన్
లవంగాల పొడి - కొద్దిగా
కొత్తమీర -కొద్దిగా
కరివేపాకు: సరిపడ
తయారీ విధానం:
-ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. తాళింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేయాలి.
-ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి , వంకాయ ముక్కలు వేసి మీడియం మంటపై వేయించాలి.
-వంకాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలపాలి. అందులో ఉడికించిన బంగాళదుంపలు వేయాలి. అంతా కలిసేలా బాగా కలుపుకుని మూతపెట్టి 5 నిమిషాలు చిన్న మంటపై మగ్గించాలి.
- తర్వాత కొత్తిమీర, దాల్చిన చెక్కపొడి, లవంగాల పొడి వేసి కలపాలి. మరోనిమిషం పాటువేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన ఆలూ వంకాయ ఫ్రై రెడీ. |