Home » Rice » Mint and Lemon Rice
మింట్ అండ్ లెమన్ రైస్
రైస్ ఐటమ్స్ ఎన్ని వెరైటీల్లో చేసినా తినటానికి బోర్ కొట్టదు. మాములు రైస్ ఐటమ్స్ కన్నా కాస్తా పుల్ల పుల్లగా ఉండే నిమ్మకాయ కలిపినా రైస్ ఐటమ్స్ ఇంకా బాగుంటాయి కదూ. అందుకే ఈ వేసవిలో ఆరోగ్యానికి కూడా మేలు చేసే నిమ్మకాయ, పుదీనా కలిపి తయారుచేసిన ఈ రైస్ ఐటెం మీ కోసం.
కావల్సిన పదార్థాలు:
ఉడికించిన అన్నం - 2 కప్పులు
పుదీనా ఆకులు 1 కప్పు
అల్లం తరుగు - 1/2 స్పూన్
పచ్చి మిర్చి - 6
జీడిపప్పు లేదా పల్లీలు - కొద్దిగా
పోపు దినుసులు - సరిపడ
నిమ్మరసం - 2 స్పూన్స్
పసుపు, ఉప్పు - కొద్దిగా
తయారి విధానం:
ఉడికించిన అన్నాన్ని ఒక బేసినలోకి తీసి ఆరబెట్టాలి. పుదీనాని మిక్సి చేసి ముద్దని రెడీగా ఉంచుకోవాలి.
స్టవ్ వెలిగించి నూనే వేసి అందులో సెనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేయాలి. తరువాత అల్లం తురుము వేయాలి.
అన్నీ కాస్త వేగాకా జీడిపప్పు గాని పల్లీలు గాని వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పుదీనా ముద్దని పోపులో వేసి పచ్చి పోయేదాకా వేగానియ్యాలి.
స్టవ్ ఆపి ఆ మిశ్రమాన్ని అన్నం లో వేసి సరిపడా ఉప్పు, పసుపు వేసి అంతటిని బాగా కలపాలి. అలా కలిపిన దాని మీద నిమ్మరసం పిండి మల్లి మొత్తాన్ని కింద మీద కలపాలి.
పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పుల్లపుల్లగా, ఎంతో రుచిగా అనిపించే మింట్ అండ్ లెమన్ రైస్ మీ ముందుంటుంది.
- కళ్యాణి