Home » Rice » Coconut Rice
కొబ్బరి అన్నం
కావాల్సిన పదార్ధాలు:
బియ్యం - ఒక కప్పు
కొబ్బరి పాలు - 1.3/4 లీటర్
నీళ్ళు - పావు కప్పు
ఉప్పు - తగినంత
తాలింపు కోసం:
నూనె - రెండు టేబుల్ స్పూన్స్
జీడిపప్పు - 15 పలుకులు
ఆవాలు - ఒక టీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూన్
శెనగపప్పు - ఒక టీస్పూన్
మినపప్పు - ఒక టీస్పూన్
కరివేపాకు - ఒక రెబ్బ
పచ్చిమిర్చి - నాలుగు
పచ్చి కొబ్బరి తురుము - ఒక కప్పు
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా కుక్కర్ తీసుకోని అందులో బియ్యం, కొబ్బరి పాలు, నీళ్ళు పోసి మూత పెట్టాలి. * మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్, హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ వచ్చాక స్టౌ ఆఫ్ చేసి ఆవిరిని పోనివ్వాలి. వేడి మీదే ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
తాలింపు:
తాలింపు కోసం కళాయిలో నూనె వేడి చేసి అందులో ముందుగా జీడిపప్పుతో పాటు రెడీ చేసుకున్న తాలింపు దినుసులు అన్నీ వేసి ఆఖరుగా కొబ్బరి తురుము వేసి కలిపి 30 సెకండ్లు వేపి ఆ తాలింపు ని కొబ్బరి అన్నంలో వేసుకుని కలుపుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా వుంటుంది.