Home » Rice » జీరా రైస్ ఇలా చేస్తే...మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!
జీరా రైస్ ఇలా చేస్తే...మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది!
జీరా రైస్ లేదా జీలకర్ర అన్నం అని పిలుస్తారు. ఈ వంటకం ప్రధానంగా బియ్యం, జీలకర్రతో తయారు చేస్తారు. జీరా రైస్ ఉత్తర భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన వంటకం. బిర్యానీలా కాకుండా, ఈ రైస్ రెసిపిని తయారుచేయడం చాలా సులభం. కొంతమంది ఈ వంటకంలో జీలకర్ర, ఉల్లి, లవంగాలు కూడా జోడిస్తారు. కొందరు దీనిని జీలకర్ర, పచ్చిమిర్చి, నెయ్యి, బియ్యం మాత్రమే ఉపయోగించి తయారు చేస్తారు. జీర్ణక్రియకు సహాయపడే జీలకర్ర కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. అనుకోకుండా స్నేహితులు, బంధువులు వచ్చినప్పుడు చాలా త్వరగా తయారుచేసుకోగలిగే గొప్ప వంటకం ఇది. మీరూ ఓసారి ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు:
బియ్యం -1 కప్పు
పచ్చిమిర్చి - 4
జీలకర్ర -1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
దశ 1:
స్టౌ వెలిగించి..దానిపై కుక్కర్ పెట్టండి. కుక్కర్ వేడి అయిన తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడి అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి వేయాలి. అవి రెండు వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేయండి. ఈ మూడింటిని కలపాలి. ఒకనిమిషం పాటు నెమ్మదిగా కలపండి.
దశ 2:
తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసి నీళ్లు పోయాలి. కుక్కర్‌లో మూడు విజిల్స్ వచ్చాక స్టౌ ఆఫ్ చేయాలి.
దశ 3:
ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేయండి. అది వేడి అయ్యాక జీడిపప్పు వేసి బంగారు వర్ణం వచ్చే వరకు వేయించాలి.
దశ 4:
వండిన జీరా రైస్‌లో నెయ్యిలో వేయించిన జీడిపప్పు వేసి అలంకరించండి. అంతే సింపులో రుచికరమైన వేడి వేడి జీరా రైస్ రెడీ. మీకు నచ్చిన గ్రేవీతో సర్వ్ చేసుకోవచ్చు.