స్పైసీ చికెన్ మసాలా రైస్

 

 

చికెన్ మసాల రైస్ - ఇది చాలా రుచికరమైన రెసిపి. చైనీస్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాకుండా మన ఇండియన్ స్టైల్లో చికెన్ మసాల రైస్ చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడము చాలా సులువు. రుచికరమైన చికెన్ మసాల రైస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం...

 

కావలసిన పదార్ధాలు:

బోన్లెస్ చికెన్ - అర కేజీ

పచ్చిమిర్చి - రెండు

టమాటా - ఒకటి

కరివేపాకు - ఒక రెమ్మ

ఎగ్స్ - రెండు

ఉప్పు, కారం - తగినంత

పుదీనా - పావుకప్పు

కొత్తిమీర - పావు కప్పు

ఉల్లిపాయ - ఒకటి

గరం మసాలా పొడి - ఒక టీ స్పూన్

పసుపు - కొంచెం

నూనె - రెండు టేబుల్ స్పూన్స్

అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

అన్నం - రెండు కప్పులు

లవంగాలు - మూడు

దాల్చినచెక్క - చిన్న ముక్క

షాజీర - కొద్దిగా

 

తయారీ :

ముందుగా చికెన్ ను సన్నగా కట్  చేసుకుని శుభ్రం చేసి కడిగి  కొద్దిగా ఉప్పు, కారం, వేసి ఉడికించి ఉంచుకోవాలి.

 

తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచం నూనె వేడి చేసి అందులో ఎగ్స్ పగలు కొట్టి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

 

తరువాత అందులోనే నూనె వేసి  లవంగాలు, చెక్క, షాజీర వేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి.

 

ఇప్పుడు కరివేపాకు, తరిగిన టమాటాముక్కలు వేసి మగ్గనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి.

 

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగాక ఉడికించిన చికెన్ ముక్కలు, వేయించిన ఎగ్స్ వేసి కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు వేయించాలి.

 

చివరగా అన్నం, తగినంత ఉప్పు, గరం మసాలాపొడి వేసి సన్నని సెగపై అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి.... కొంచెం కొత్తిమీర చల్లి వేడి వేడిగా వడ్డిస్తే ఎంతో ఇష్టంగా చికెన్ మసాలా రైస్ తింటారు..