మెంతికూర మటన్ గ్రేవీ!

కావలసిన పదార్థాలు:

మెంతికూర - కొద్దిగా

మటన్ - అర కిలో

కొబ్బరి పాలు - కొద్దిగా

పసుపు - కొద్దిగా

వెల్లుల్లి,అల్లం - కొద్దిగా

పచ్చిమిర్చి - 3-4

గరం మసాలా పొడి - అర చెంచా

ఉల్లిపాయ - 1

టొమాటో-1 చిన్నది

నూనె-కొద్దిగా

ఉప్పు -రుచికి సరిపడా

తయారీ విధానం:

మెంతికూర మటన్ గ్రేవీ తయారు చేసే ముందు...ఒక కుక్కర్ తీసుకుని స్టవ్ వెలిగించి దాని పెట్టాలి. అది వేడెయ్యాక అందులో నూనె వేసి ఉల్లిపాయలు, పసుపు వేసి బ్రౌన్ కలర్ లో కి వచ్చేదాక వేయించాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని లేదంటే పేస్టు చేసుకున్నది అందులో వేయాలి. కొద్దిగా వేగిన తర్వాత మటన్ వేయాలి. తర్వాత మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్టు , టమోటా ముక్కలు వేసి వేయించాలి. మెంతికూర పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత...అందులో కొబ్బరిపాలు, గరంమసాలా పొడి వేసి మరిగించాలి. తర్వాత సరిపడా ఉప్పు వేసి..కొన్ని నీళ్లు పోయాలి. సన్నని మంట మీద 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేంత వరకు ఉంచి మూత తీయాలి. అంతే సింపుల్ మెంతికూర మటన్ గ్రేవీ రెడీ.