పెప్పర్ చికెన్ గ్రేవీ!


మాంసాహారం ఇష్టపడేవారికి ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా ఏదొక కొత్త వెరైటీ కావాలని కోరుకునేవాళ్లు చాలామందే ఉంటారు. అందుకే అలాంటివారి కోసం స్పైసీ పెప్పర్ చికెన్ గ్రేవీ ట్రై చేసి చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

చికెన్ - 500గ్రాములు

కొబ్బరినూనె -పావు కప్పు

పెద్ద ఉల్లిపాయలు -రెండు

పచ్చిమిర్చి - రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 టేబుల్ స్పూన్లు

టమోటాలు -రెండు పెద్దవి

పసుపు -టీస్పూన్

మిరియాలు- ఒక టీస్పూన్

గరం మసాలా-రెండు స్పూన్లు

ఉప్పు- రుచికి సరిపడా

కొత్తిమీర-గార్నిషింగ్కకోసం

దాల్చినచెక్క- అంగుళం ముక్క

తయారీ విధానం:

-చికెన్ బాగా కడిగి మూడొంతుల ఉడికించి పక్కనపెట్టాలి.

- ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి మసాలా దినుసులు అన్ని వేయించండి. పొడి చేసి పక్కన పెట్టుకోంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించండి. దీన్ని మసాల పొడితో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అదే పాత్రలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, మిరపకాయలు, బిర్యానీ ఆకు వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పచ్చివాసన పోయేవరకు వేయించి టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలా అందులో వేయాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు అందులో చికెన్ వేయాలి. నూనె బాగా తేలే వరకు కలిపాలి. గ్రేవీ దగ్గర పడేవరకు ఉంచి తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపు స్పైసి చికెన్ పెప్పర్ గ్రేవీ రెడీ. చపాతీతోపాటు తింటే రుచి అదిరిపోతుంది.