చిల్లీ చికెన్
చిల్లీ చికెన్ అనేది చాలా ప్రజాదరణ పొందిన వంటకం. ప్రస్తుతం పార్టీల్లో చిల్లీ చికెన్‌ను స్టార్టర్‌గా అందిస్తున్నారు. చిల్లీ చికెన్‌ని ఇష్టపడేవారు ఇప్పుడు ఈ సింపుల్ రిసిపిని ఇంట్లోనే తయారు చేసుకుని ఆనందించవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
బోన్ లెస్ చికెన్ -400 గ్రాములు.
ఉప్పు -1 1/2 స్పూన్
మొక్కజొన్న పిండి -4 టేబుల్ స్పూన్లు
నల్ల మిరియాలు -2 స్పూన్
గుడ్డు -1
సోయా సాస్ -3 స్పూన్
చిల్లీ సాస్ -2 స్పూన్
వెల్లుల్లి -8-10
పచ్చిమిర్చి -8-10
గ్రీన్ చిల్లీ సాస్ -2 స్పూన్
వెనిగర్ -1 స్పూన్
ఉల్లిపాయ, ముక్కలుగా కట్ చేసి -1
క్యాప్సికమ్ - 1 ముక్కలుగా కట్ చేయాలి
చిల్లీ చికెన్ ఎలా తయారు చేయాలి:
ఒక గిన్నెలో చికెన్ తీసుకుని, ఉప్పు, మొక్కజొన్న పిండి, నల్ల మిరియాలు, గుడ్డు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి... బాగా కలపండి. 20 నిమిషాల పాటు మేరినేట్ చేయడానికి వదిలివేయండి. మేరినేట్ చేసిన తర్వాత చికెన్ ముక్కలను బయటకు తీసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలను బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. మరో పాన్ తీసుకుని అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఇప్పుడు దానికి వేయించిన చికెన్ వేసి, దానితో పాటు సోయాసాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, బ్లాక్ పెప్పర్, ఉప్పు వేయాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి. ఇప్పుడు వేడిగా వడ్డించండి. చిల్లీ చికెన్‌ను ఎలా సర్వ్ చేయాలి: నూడుల్స్ , ఫ్రైడ్ రైస్‌తో సర్వ్ చేయండి.
చలికాలంలో చిల్లీ చికెన్ తింటే దానికంటూ ప్రత్యేకమైన రుచి ఉంటుంది.