రొయ్యల ఇగురు
కావలిసినవి:
రొయ్యలు- ఆరకేజీ
ఉల్లిపాయలు - నాలుగు
అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు
జీలకర్ర - 2 స్పూన్లు
కరివేపాకు - రెండు రెబ్బలు
టమాటాలు - మూడు
కొబ్బరి పాలు - ఒక కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
కారం, ఉప్పు, పసుపు, నూనె - తగినంత
తయారు చేసే పద్ధతి:
రొయ్యలను శుభ్రం చేసి బాగా కడిగి కొంచెం ఉప్పు, పసుపు పట్టించి ఆరగంటసేపు నానబెట్టాలి. తరువాత ఒక బాణిలో నూనెపోసి కాగాక రొయ్యలను వేసి చిటపటలాడే వరకూ వేయించాలి. అలాగే వాటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వెయ్యాలి. ఈ మిశ్రమంలో అరకప్పు నీళ్ళు పోసి కలిపి సన్నని మంట మీద ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత, మరోసారి కలిపి జీలకర్ర, సన్నగా తరిగిన టమాట ముక్కలను వెయ్యాలి. గుజ్జుగా తయారైన తర్వాత కొబ్బరిపాలు వేసి కలియబెడితే చిక్కటి గ్రేవీ వస్తుంది. ఈ వేడి వేడి రొయ్యల ఇగురుని అతిథులకు వడ్డించండి.