రొయ్యల ఇగురు ఆంధ్ర స్పెషల్
కావలసిన పదార్థాలు:
రొయ్యలు: 500 గ్రాములు
దాల్చినచెక్క: కొద్దిగా
గరంమసాలా: 2 స్పూన్స్
నూనె: 25 గ్రాములు
పచ్చిమిర్చి: ఆరు
కొత్తిమీర తరుగు: చిన్న కప్
పసుపు: చిటికెడు
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉల్లితరుగు: 2cup
ఏలకులు: 6
జీడిపప్పు: 50 గ్రాములు
గసగసాలు: 2tsp
పచ్చి కొబ్బరి తురుము: 1 కప్
తయారి విధానం:
ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకుని కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక ఉల్లితరుగు, దాల్చినచెక్క, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్ట్, ఏలకులు, పసుపు వేసి దోరగా వేయించాలి.
అందులో ఉడికించిన రొయ్యలు, జీడిపప్పు, పావు కప్పు నీరు వేసుకోవాలి.
గసగసాలు, పచ్చి కొబ్బరి, ఏలకులు, చెక్క వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. తరువాత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి.
చివరిలో కరివేపాకు, కారం, గరంమసాలా వేసి కలిపి నీరులేకుండా దగ్గరికి వచ్చేవరకు ఉడికించాలి.