రంజాన్ స్పెషల్ బిర్యాని

 

 

 

కావలసిన పదార్థాలు:

బాస్మతి - 1 కేజీ

మటన్‌ - 1 కేజీ

పెరుగు - ఒకటిన్నర లీటరు

ఉప్పు - సరిపడా

ఉల్లిపాయలు - పెద్దవి రెండు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 స్పూన్లు

ధనియాల పొడి - 2 స్పూన్లు

యాలకుల పొడి - అర టీ స్పూన్‌

మిరియాల పొడి - 2 టీ స్పూన్లు

దాల్చిన చెక్క - కొద్దిగా

జీలకర్ర - 1 స్పూన్‌

కుంకుమ పువ్వు - చిటికెడు

లవంగాలు - 20

నీళ్లు - 2 కప్పులు

నెయ్యి - పావు కిలో

 

తయారీ విధానం :

ముందుగా మటన్‌ చిన్న ముక్కలు కోసి శుభ్రం చేసుకోవాలి. దానికి అల్లం వెల్లుల్లి , ఉల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు,పెరుగు, నీళ్లు పోసి బాగా కలిపి రెండు గంటలు నానబెట్టాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో మటన్‌ ముక్కలు వేసి సమానంగా పరవాలి. నెయ్యి లవంగాలను నేతిలో వేయించి వీటిని మటన్‌ ముక్కల మీద వెయ్యాలి. తరువాత కడిగిన బియ్యానికి అరలీటర్‌ పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కలమీద వేసి మూత పెట్టి ఉడికించాలి. మంట సిమ్ లో పెట్టిదమ్‌ చేయాలి. నీరు ఇగిరి పోయేవరకు వుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.