రాగి కేక్!
కావలసిన పదార్ధాలు:
రాగి పిండి - ముప్పావు కప్పు
గోధుమ పిండి - ముప్పావు కప్పు
ఉప్పు - చిటికెడు
బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూను
బేకింగ్ సోడా - అర టీ స్పూను
బెల్లం పొడి - 1 కప్పు
పంచదార - 2 టేబుల్ స్పూన్లు
కోకో పొడి - 3 టేబుల్ స్పూన్లు
బటర్ - 150 మి.లీ. (కరిగించినది)
వెనిలా ఎసెన్స్ - 1 టేబుల్ స్పూను
కొబ్బరి పాలు - 1 కప్పు
పెరుగు - పావు కప్పుటాపింగ్ కోసం
తయారుచేసే విధానం:
ముందుగా కేక్ ప్యాన్‌కి కొద్దిగా నెయ్యి పూయాలి. అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర కనీసం పావు గంట సేపు ప్రీహీట్ చేయాలి.
ఒక బౌల్‌లో రాగి పిండి, గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, కోకో పొడి... వీటన్నిటినీ జత చేసి జల్లించి పక్కన ఉంచాలి.
మరో రెండు సార్లు జల్లెడ పట్టాలి. మెత్తగా చేసిన బెల్లం పొడి జత చేయాలి. ముప్పావు కప్పు కొబ్బరి పాలు జత చేయాలి.
కరిగించిన బటర్, పెరుగు జత చేయాలి. ఉండలు లేకుండా అన్నీ బాగా కలిసేలా గరిటెతో కలియబెట్టాలి.
ఇప్పుడు నెయ్యి రాసిన ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, అవెన్ సుమారు అరగంట సేపు ఉంచాలి. బయటకు తీయడానికి ముందు సుమారు పావు గంట సేపు చల్లారనివ్వాలి.
ఒక పాత్రలో పాలు, పంచదార, కోకో పొడి వేసి స్టౌ మీద ఉంచి, పంచదార కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి. మంట బాగా తగ్గించి, ఈ మిశ్రమాన్ని మరిగించాలి.
ఇందులో వెనిలా ఎసెన్స్ వేసి, మిశ్రమం చిక్కబడేవరకు కలియబెట్టి, దింపి చల్లారబెట్టాలి. మిశ్రమం చిక్కగా, క్రీమీగా తయారవుతుంది.
ఈ మిశ్రమాన్ని కేక్ మీద సమానంగా పోసి, చాకుతో సరిచేయాలి. అంతే... టేస్టీ టేస్టీ రాగి కేక్ రెడీ.