మొక్కజొన్న గారెలు


కావాల్సిన పదార్ధాలు:

నానబెట్టిన మొక్కజొన్నగింజలు - 2కప్పులు

ఎండుమిర్చి - 2

పచ్చిమిర్చి - 2

ఉప్పు - రుచికి సరిపడా

అల్లం - అర ఇంచు ముక్క

వెల్లుల్లి రెబ్బలు - 4

జీలకర్ర - అర టీస్పూన్

శనగపిండి - 1 టేబుల్ స్పూన్

బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్

కరివేపాకు - 1 రెమ్మ

కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్

పుదీనా - 2 టేబుల్ స్పూన్స్

ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు

ధనియాల పొడి - అర టీస్పూన్

గరం మసాలా - పావు టీ స్పూన్

చాట్ మసాలా - పావు టీ  స్పూన్

పసుపు - కొద్దిగా

నూనె - డీప్ ఫ్రై కోసం

తయారీ విధానం:

- ముందు నానబెట్టిన మొక్కజొన్న గింజలను వడకట్టుకుని మిక్సీ పట్టుకోవాలి.

- ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా చల్లుకోవచ్చు. అన్నింటికీ ఉప్పు పట్టేలా ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

- తర్వాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని వేసుకుని కలుపుకోవాలి.

- కళాయిలో నూనె పోసి వేడిచేసుకోవాలి.

- నూనె బాగా వేడయ్యాక కొద్దికొద్దిగా పిండి తీసుకొని గారేలులాగా చేతి పైన ఒత్తుకొని, నూనెలో వేసి లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ.

గారెలు మరీ మందంగా మరీ పలుచగా కాకుండా వత్తుకోవాలి.

నోట్: 1. మొక్క జొన్న మరి ముదురు గా ఉన్నది కాకుండా లేతది తీసుకుంటే గారెలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి.

2. పిండి పట్టేటప్పుడు మరి మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటేనే తినేప్పుడు మొక్క జొన్న రుచి నోటికి తగులుతుంది.