హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ ఓట్స్ సూప్

 

కావాల్సిన పదార్థాలు:

ఓట్స్- పావుకప్పు

క్యారెట్స్-పెద్దవి రెండు

ఉల్లిపాయలు-రెండు

వెన్న-టీ స్పూన్లు

కొత్తిమీర-సగం కట్ట

ఉప్పు -రుచికి సరిపడా

మిరియాల పొడి-చిటికెడు

తయారీవిధానం:

క్యారెట్లను శుభ్రంగా కడిగి వాటి పొరను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఒక కడాయిలో రెండు కప్పుల నీరు పోసి అందులో తరిగిన ఉల్లిపాయలు,

క్యారెట్ ముక్కలు వేసి ఉడికించాలి.

మెత్తగా ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి.

చల్లారిన తర్వాత మిక్సి జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.

మరోపాన్ వేడి చేసి అందులో వెన్న వేడి వేడి చేయాలి.

అందులో ఓట్స్ వేసి దోరగా వేయించాలి.

తర్వాత కొన్ని నీళ్లు పోసి మీడియం మంటమీద ఉడికించాలి.

ఓట్స్ ఉడికిన తర్వాత అందులో క్యారెట్ రసం వేసి ఉప్పు, మిరియాల పొడి వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.

అవసరం అనుకుంటే టమోటా సాస్ కూడా వేసుకోవచ్చు.

అంతే సింపుల్ క్యారెట్ ఓట్స్ సూప్ రెడీ.