వరిగ కాజా
కావలసిన పదార్ధాలు:
వరిగ పిండి - అర కప్పు
నూనె - డీప్ ఫ్రైకి తగినంత
గోధుమ పిండి - అర కప్పు
పాకం కోసం బెల్లం పొడి - అర కప్పు
యలకుల పొడి - 1 టీ స్పూను
తయారుచేసే విధానం:
ఒక పాత్ర తీసుకొని అందులో వరిగ పిండి, గోధుమ పిండి వేసి కలపాలి.. వేడి నూనె జత చేసి మెత్తటి ముద్దలా తయారుచేసుకోవాలి.
రొట్టెలాగ అంగుళం మందంలో పొడవుగా ఒత్తి, రోల్ చేసుకోవాలి. ఆ రోల్‌ని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచాలి.
వెలిగించిన స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, కట్ చేసి ఉంచుకున్న కాజాలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి టిష్యూ పేపర్ మీదకు తీసుకోవాలి.
ఒక పెద్ద గిన్నెలో బెల్లం పొడిని వేసి, తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచాలి. తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి. ఏలకుల పొడి వేసి దింపేయాలి.
వేయించి పక్కన పెట్టుకున్న కాజాలను పాకంలో వేసి సుమారు అర గంట సేపు మూత పెట్టి ఉంచాలి. బాగా పాకం పీల్చుకున్న కాజాలను తీసి సర్వింగ్ ప్లేట్ లో పెట్టుకుని సర్వ్ చేసుకోవాలి.