పెప్పర్ పిష్ ఫ్రై

 

 

కావలసిన పదార్ధాలు :-

పిఫ్ ముక్కలు - 8

మిరియాలు - 3 చెంచాలు

పసుపు - 1 చెంచా

ధనియాల పొడి - 1 చెంచా

కారం - 1 చెంచా

వెల్లుల్లి - 10 రెబ్బలు

ఉప్పు - తగినంత

నూనె - 4 చెంచాలు

సన్నగా తరిగిన కొత్తిమీర


తయారు చేసే విధానం :-

ముందుగా ఒక బౌల్ తీసుకొని, దానిలో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత మిక్సీ బార్ లో మిరియాలు, వెల్లుల్లి తీసుకొని మెత్తని పేస్టులా చేయాలి.

ఈ పేస్టుని పొడి మసాలాలో వేసి కొద్దిగా నూనె వేసి బాగా కలపాలి. ఈ మసాలా ముద్దను చేప ముక్కలకు బాగా పట్టించి, అరగంట సేపు పక్కన పెట్టాలి.

ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక చేప ముక్కలు వేసి సన్నని మంట మీద ఫ్రై చేయాలి.

పది నిమిషాలు వేపిన తరువాత చేప ముక్కలను రెండవ వైపుకు తిప్పి వేపాలి. రెండు వైపులా బాగా వేగిన తరువాత ముక్కలను ఒక ప్లేట్ లోకి తీసుకొని తరిగిన కొత్తిమీరతో అలంకరించాలి.

కరకరలాడే స్పైసీ పెప్పర్ పిష్ ఫ్రై రెడీ. ఇది స్టార్టర్ గా బాగుంటుంది.