ఎగ్ మసాలా కర్రీ
కావాల్సిన పదార్థాలు:
కోడిగుడ్లు -5
కారం -1 స్పూన్
పసుపు - అర టీస్పూన్
గరం మసాలా -అరటి స్పూన్
దాల్చిన చెక్క -అంగుళం
లవంగాలు-2
జీలకర్ర - అరటీస్పూన్
ధనియాలు -అర టీస్పూన్
ఉల్లిపాయలు - రెండు
టమాట - 1
అల్లం, వెల్లుల్లి -అర స్పూన్
కొబ్బరి తురుము -అర కప్పు
ఆవాలు- అరటీస్పూన్
కొత్తిమీర - 5 రెబ్బలు
ఉప్పు- రుచికి సరిపడినంత
తయారీ విధానం:
-ముందుగా నాలుగు గుడ్లను ఉడకబెట్టుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పెనంలో కొంచెం నూనె వేసి అందులో పసుపు వేసి ఈ నాలుగు గుడ్లను అందులో వేసి రెండు నిమిషాలు వేయించండి.
-తర్వాత వాటిపై కారం వేయండి. గుడ్లు బంగారం వర్ణంలోకి వచ్చే వరకు ఫ్రై చేయండి. తర్వాత వాటిని తీసి పక్కనపెట్టి అదే పాన్ లో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వేసి వేయించండి. తర్వాత ఉల్లితరుగు వేసి మెత్తగా అయ్యేంతవరకు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి, లవంగాలు వేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి.
-ఇప్పుడు తరిగిన టమోటా వేసి 5 నిమిసాలు వేయించాలి. టమాట మెత్తగా అయ్యాక అరకప్పు తురిమిన కొబ్బరి వేసి కలపాలి. ఆ తర్వాత కొత్తిమిర వేసి కడాయి దించాలి. ఈ మిశ్రమాన్ని చల్లారినివ్వాలి. దానిని మెత్తని పేస్టులా చేయాలి.
-మళ్లీ పాన్ వేడి చేసి కొంచెం నూనె వేసి అందులో ఆవాలు, కరివేపాకు, వేయాలి. తరిగిన ఉల్లిపాయ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకు వేయించాలి. అందులో గ్రౌండ్ చేసి పక్కన పెట్టిన మసాలా ముద్ద తోపాటు టీ స్పూన్ ఉప్పు, అరకప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడే కారం, ఉప్పు, మసాలా అన్ని వేసి తక్కువ మంటమీద 10 నిమిషాలు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు అందులో ఒక పచ్చిగుడ్డు కొట్టి వేయాలి. వెంటనే గుడ్డులో అందులో కలిసిపోయేలా కలపాలి. తర్వాత వేయించిన గుడ్లు వేసి మరో 5 నిమిషాలు ఉడకబెట్టండి. ఇప్పుడు కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే వేడివేడి మంగుళూరు ఎగ్ మసాలా కర్రీ సిద్ధం.