పాలకూర పచ్చడి
కావలసినవి:
పాలకూర - 2 పెద్ద కట్టలు
ఉల్లిపాయ - 1
చింతపండు - కొంచెం
ధనియాలు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఆవాలు - 1/4 టీస్పూన్
జీలకర్ర - 1/4 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 6
పసుపు - చిటికెడు
మెంతులు - 3 లేక 4
ఉప్పు - సరిపడినంత
నూనె - 6 టీస్పూన్స్
తయారు చేయు విధానం:
మొదట పాలకూరను కాడలు తీసేసి శుభ్రం చేసి కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని దానిలో 5 టీస్పూన్ల నూనె వేసి, వేడెక్కిన తరువాత ధనియాలు, మినపప్పు, మెంతులు, ఎండుమిరపకాయలు వేసి గోల్డ్ కలర్ వచ్చేవరకూ వేయించి తీసి ప్రక్కనపెట్టుకోవాలి. తరువాత అదే పాన్ లో పాలకూర, చింతపండు, పసుపు వేసి చిన్న మంట మీద 5 నిముషాలు వేయించుకోవాలి. పాలకూర ఉదికేవరకూ అప్పుడప్పుడూ కలుపుతూ ఉండాలి. ఎప్పుడయితే పాలకూర లైట్ గ్రీన్ కలర్ వస్తుందో అప్పుడు తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మిక్సీ లో మొదట వేయించుకున్న వాటిని వేసి గ్రైండ్ చేసి పొడి అయ్యిన తరువాత, పాలకూరను కూడా వేసి పేస్టు చేసి చివరగా ఉల్లిపాయ ముక్కలువేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయ్యిన పేస్టులో ఉప్పు కలిపి ఆ పేస్టుని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. ఈ పేస్టు తాలిపు వేసుకుని సర్వ్ చేసుకోవాలి.