Natu Kodi Koora Recipe

 

 

 

కావలసిన పదార్థాలు :

నాటు కోడి ఒకటి,

ఒకటిన్నర స్పూన్ అల్లం,

పావుకిలో ఉల్లిపాయలు,

తగినన్ని పచ్చిమిర్చికాయలు మరియు ఎండు మిర్చికాయలు,

మూడు టీ స్పూన్ల గగసాలు,

రెండు టీ స్పూన్ల జీలకర్ర,

టీ స్పూన్ మెంతులు,

టీ స్పూన్ ఆవాలు,

రెండు నిమ్మకాయ ముక్కలు,

ఒకకట్ట కొత్తిమీర,

తగినంత నూనె.

 

తయారుచేయు పద్దతి :

ముందుగా కోడిని శుభ్రం చేసుకుని ఆ తరువాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన ముక్కలకి వెల్లుల్లి, ఉప్పు, పసుపు మూడింటిని కలిపి గంటసేపు ఉంచాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించుకుని ఒక మూకెడు పెట్టి, అందులో తగినంతగా నూనె పోసి, ఆ నూనె కాగిన తరువాత మనం సిద్దం చేసి పెట్టుకున్న ఉప్పు, కారం, పసుపు మూడు కలిపినా కోడి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అన్ని కలిసిపోయేలా కలిపి మూత పెట్టి కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అలా కొంచెం మెత్తగా ఉడికిన తరువాత గగసాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి పొడి చేసి ఉడుకుతున్న ముక్కల్లో వేసుకోవాలి. ఆ తరువాత ఆవాలు, మెంతులు ముద్దను వేసి మరికొంచెం ఉడకనివ్వాలి. కూర ఉడికిందని మనకు అనిపించగానే దించేటప్పుడు తగినంత ఉప్పును వేసి కలుపుకోవాలి. పూర్తిగా దించాక నిమ్మరసం పిండుకుని తింటే ఆహా ఆ రుచే రుచి. మరి ఇకేందుకు ఆలస్యం మీరు ఇలా నాటుకోడి కూర వండుకుని ఆ రుచిని ఆస్వాదించండి.