మామిడికాయ మటన్ కర్రీ

 

 

కావలసినవి:

పచ్చిమామిడికాయ - ఒకటి

మటన్ - అరకేజీ

ఉల్లిపాయలు - మూడు

జీలకర్ర - అరటీస్పూను

పసుపు - పావుటీస్పూను

కారం - రెండు టీస్పూన్లు

ఎండుమిర్చి - ఐదు

గరంమసాలా - టీస్పూను

అల్లంవెల్లుల్లి - రెండు టేబుల్‌స్పూన్లు

నూనె - అరా కప్పు

 

తయారీ :

ముందుగా జీలకర్ర, గరంమసాలా, ఎండుమిర్చి అన్నింటినీ కలిపి వేయించి మిక్సిలోకి తీసుకుని తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించి మొత్తం మిక్సిలో గ్రైండ్‌ చేయాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి కాగాక మసాలా ముద్ద వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి, పసుపు, కారం కలపాలి. తరువాత శుభ్రంగా కడిగిన మటన్‌ను వేసి కలిపి సరిపడా నీళ్ళుపోసి సన్నని మంట మీద ఉడికించాలి. మటన్‌ ఉడుకుతుండగా చెక్కు తీసి కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని వేసి  గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. గ్రేవి చిక్కబడ్డాకా స్టవ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని వేడి వేడి రైస్ తో సర్వ్ చేసుకోవాలి.