సామలు పుట్ట గొడుగుల బిర్యానీ
కావలసినవి:
సామలు - 1 కప్పు
పుట్ట గొడుగులు - 100 గ్రా
నెయ్యి - 2 టీ స్పూన్లు తరిగిన
టొమాటో తరుగు - పావు కప్పు
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూను
ఉల్లి తరుగు - పావు కప్పు
మిరప కారం - ఒక టీ స్పూను
పసుపు - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
గరం - తగినంత
కొత్తిమీర - 1 కప్పు
పచ్చి మిర్చి - 1
ఏలకులు - 1
నీళ్లు - 2 కప్పులు
తరిగిన పుదీనా - అర కప్పు
లకులు - 1
దాల్చిన చెక్క - చిన్న ముక్క
బిర్యానీ ఆకు - 1
లవంగాలు - 4
జాపత్రి - చిన్న ముక్క
సోంపు - 1 టీ స్పూను
కరివేపాకు రెమ్మలు - 2
జీలకర్ర - ఒక టీ స్పూను
తయారుచేసే విధానం:
స్టౌ వెలిగించి దాని మీద బాణలి ఉంచి వేడయ్యాక సామలను వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి. స్టౌ మీద కుకర్ ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి. బిర్యానీ ఆకు వేసి వేయించాక, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, జాపత్రి ముక్క, సోంపు గింజలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఉల్లి తరుగు జత చేసి బంగారురంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, పచ్చి మిర్చి తరుగు, గరం మసాలా, వేసి వేగనివ్వాలి. బాగా వేగిన తరవాత తరిగి ఉంచుకున్న పుట్టగొడుగులు, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. సామలు జతచేయాలి. కొద్దిగా నీళ్లు, కొంచెం కరివేపాకు, పుదీనా ఆకులు వేసి మూత పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దింపేసి, మూత తీశాక కొత్తిమీరతో అలంకరించాలి. గరిటెతో వడ్డించాలి.