గోంగూర మటన్ రెసిపి

 

 

 

 

కావలసినవి:

మటన్ - 250 గ్రాములు
గోంగూర - 200 గ్రాములు
గసగసాలు - 50 గ్రాములు
జీడిపప్పు - 10 గ్రాములు
నూనె - తగినంత
ఉల్లిపాయ - ఒకటి
కారం - టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 5
పసుపు - టీ స్పూన్,
ధనియాల పొడి - టీ స్పూన్
గరం మసాలా పొడి - పావ్ స్పూన్
జీలకర్ర - ఒక స్పూన్
ఆవాలు - ఒక స్పూన్
ఎండు మిరపకాయలు - మూడు

 

తయారి:
ముందుగా  స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు,ఎండు మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయించుకోవాలి.

మటన్ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. మటన్ ఉడికిన తర్వాత గోంగూర కూడా వేసి ఉడికించాలి.

గసగాసాలు,జీడిపప్పు కలిపి పేస్ట్ ల చేసుకుని మసాలా ఉడుకుతున్న మటన్ లో వెయ్యాలి.

చివరిలో ధనియాల పొడి,గరం మసాల వేసి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.