జింజర్ ప్రాన్స్

 

 

 

 

కావలసినవి:
ప్రాన్స్ - 200 గ్రాములు
మిరియాల పొడి - టీ స్పూన్
కారం - రెండు టీ స్పూన్లు
నూనె -  సరిపడా
సోయా సాస్ - టీ స్పూన్
ఫుడ్ (రెడ్) కలర్ - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా
ఉల్లిపాయలు - రెండు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరకప్పు
టొమాటో సాస్ - టీ స్పూన్
అజినమోటో- టీ స్పూన్
ఉప్పు - తగినంత

 

తయారి విధానం :
ముందుగా ప్రాన్స్‌ని శుభ్రంగా కడిగి వేడినీటిలో వేసి ఒక మోస్తరుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఉల్లిపాయ పేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్, అజినమోటో, మిరియాలపొడి, కారం, ఉప్పు వేసి  వేయించాలి. తర్వాత సరిపడా నీళ్ళు పోసి ఉడికించాలి. నీరు దగ్గర పడేటప్పుడు అందులో టొమాటో సాస్, సోయా సాస్, ఫుడ్ కలర్ వేసి కలిపి ఉడికించిన రొయ్యలను కలిపి తరువాత నూనె లో డీప్ ఫ్రై చేసి వేగిన ప్రాన్స్‌ను సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చెయ్యాలి