ఎగ్ పన్నీర్ కర్రీ రెసిపి

 

 

 

కావలసినవి :
పన్నీర్                      -      పావుకిలో
కొత్తిమీర తురుము       -      2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు            -      4
కారం                         -      2 టీస్పూన్లు
ఉల్లిపాయ                   -      1
గరం మసాలా               -      ముప్పావు టీస్పూన్
గుడ్లు                          -       4
నూనె                          -      3 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి              -      అర టీస్పూన్
పచ్చిమిర్చి తురుము      -      టీస్పూన్
పసుపు                       -      టీస్పూన్
అల్లం                           -      అర అంగుళం ముక్క
ఉప్పు                           -      తగినంత
టొమాటో గుజ్జు               -      2 టేబుల్ స్పూన్లు

 

తయారుచేసే విధానం :

 ముందుగా కోడిగుడ్లను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకుని పాన్  పెట్టుకుని పన్నీర్ ను ముక్కలుబ్రౌన్  కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ,అల్లం, పచ్చిమిర్చి అన్నీ కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్  వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేసి  వేయించుకుని, ఉప్పు, కారం,పసుపు, ధనియాల పొడి వేసి వేయించి, టమాటా గుజ్జు కూడా వేసి వేయించాలి.

ఉడికించిన కోడిగుడ్లు ,పన్నీర్ ముక్కలు,వేసి కలపాలి.  నీళ్ళు పోసి పది నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసుకోవాలి.