ఎగ్‌ మాసాలా రెసిపి

 

 

 

 

కావలసిన పదార్ధాలు :

కోడిగుడ్లు -  నాలుగు
ఉప్పు - తగినంత.
ఉల్లిపాయలు -  3
అల్లం -చిన్నముక్క,
ధనియాలు - ఒక స్పూన్
జీలకర్ర పొడి - ఒక స్పూన్‌
కారం  -  ఒక స్పూన్‌
నూనె : సరిపడగా
వెల్లుల్లి రెబ్బలు - 4
టొమాటోలు -  2
పసుపు - పావు టీ స్పూన్‌
కొత్తిమీర -  తగినంత

 

తయారు చేసే పద్ధతి:
ముందుగా కోడి గుడ్లను ఒక గిన్నె లో వేసి ఉడికించి చల్లారక పెంకు తీసేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ పెట్టి నూనె వేసి వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు అన్నిటిని వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. దాంట్లో టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న గుడ్లు  మధ్యలోకి కట్ చేసి వేగుతున్న మిశ్రమం లోకి వేసి అందులో కారం, జీలకర్ర, ధనియాల పొడి,  ఉప్పు వేసి పదిహేను నిమిషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని  కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి..