ఎగ్ మసాలా కర్రీ

 

 

 

కావలసినవి:
కోడిగుడ్లు- 4
యాలకులు - 3
దాల్చినచెక్క - చిన్న ముక్క
టమాటాలు - 2
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
లవంగాలు - 4
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
మిరియాలు- 6
కారం - రెండు స్పూన్లు
పసుపు - అర స్పూన్
గసగసాలు - 1స్పూన్
కొబ్బరిపొడి - 2 స్పూన్లు

 

తయారీ :
ముందుగా కోడిగ్రుడ్లు ఉడికించి పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్‌ పెట్టి అందులో నూనె వేసి  లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి, కారం, పసుపు, గసగసాలు, కొబ్బరి పొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి  చల్లారక  మిక్సిలో వేసి పేస్ట్ లా పెట్టుకోవాలి . తరువాత  పాన్‌పెట్టి  నూనె వేసి గ్రుడ్లు వేసి కొద్దిగా వేయించి తీసేసి  మసాలా పేస్ట్ సరిపడా నీళ్ళు పోసి ఐదు  నిమిషాలు ఉడికిన తర్వాత  గ్రుడ్లు వేసి  తగినంత ఉప్పు వేసి కలిపి గ్రేవీ చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి...