ఎగ్ కోఫ్తా రెసిపి

 

 

 

 

కావలసినవి:

కోడిగుడ్లు - 4

గరం మసాలా - అర స్పూన్

నిమ్మరసం - టీ స్పూన్

ఉప్పు - రుచిసరిపడా

ధనియాలపొడి - అర టీ స్పూన్

కొత్తిమీర  - చిన్న కట్ట

నూనె - సరిపడా

శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు

ఖీమా - 200 గ్రాములు

పచ్చిమిర్చి - 4

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్స్

కారం - టీ స్పూన్

 

తయారి:

ముందుగా ఒక పాత్ర తీసుకుని గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కకి పెట్టుకోవాలి.

తరువాత పాత్రలో మటన్ ఖీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, నిమ్మరసం,కారం, ధనియాలపొడి,ఉప్పు,పచ్చిమిర్చి తరుగు,శనగపిండి,, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.

గుడ్లను కూడా అందులో వేసి వేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసి కాగనివ్వాలి.

తర్వాత ఆ గుడ్డుపై కలిపి వుంచుకున్న మిశ్రమం ఒక లేయర్ లా పెట్టి నూనెలో వేసిగోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి.

ఇప్పుడు వాటిని రౌండ్ గా ఉత చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.