కొబ్బరి - చికెన్ స్ట్రిప్స్

 

 

కావలసిన పదార్థాలు

బోన్ లెస్ చికెన్ స్ట్రిప్స్ - పది
మైదా - ఒక కప్పు
పచ్చి కొబ్బరి తురుము  - ఒక కప్పు
బ్రెడ్ పొడి  - ఒక కప్పు
కోడిగుడ్లు  - రెండు
మిరియాల పొడి - ఒక చెంచా
కారం - అర చెంచా
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా

 

తయారీ విధానం:-

చికెన్ స్ట్రిప్స్ ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఓ బౌల్ లో మైదా, కొబ్బరి, మిరియాల పొడి, ఉప్పు, కారం, కోడిగుడ్ల సొన వేసి బాగా కలపాలి. చికెన్ స్ట్రిప్స్ ని ఈ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు ఉంచాలి. ఆపైన స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. బాగా కాగిన తరువాత చికెన్ స్ట్రిప్స్ ను బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చే వరకూ వేయించి తీసేయాలి. ఇవి టొమాటో సాస్ తో కానీ, చిల్లీ సాస్ తో కానీ తింటే చాలా బాగుంటాయి.

 

--Sameera