చైనీస్ చికెన్

 

 

 

 

కావలసినవి:

చికెన్ లెగ్ పీస్ లు - 5
టొమాటో సాస్ - ఒక స్పూన్లు
సోయ్ సాస్ - 1 స్పూన్
వైట్ పెప్పర్ - ఒక స్పూన్
కరివేపాకు - కొద్దిగా
మైదా - 1స్పూన్
చిల్లి సాస్ - 1స్పూన్
నూనె - తగినంత
పచ్చి మిరపకాయలు - 4
కార్న్ ఫ్లౌర్ - 2 స్పూన్స్
కోడి గ్రుడ్డు - 1
అజినోమోటో - చిటికెడు
కారం - రెండు స్పూన్లు
నిమ్మ రసం - ఒక స్పూన్
ఉప్పు - సరిపడా

 

తయారు చేసే విధానము
ముందుగా ఒక గ్రుడ్డు ని గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.గిన్నె లో కార్న్ ఫ్లౌర్, మైదా, సోయ్ సాస్, చిల్లి సాస్, టొమాటో సాస్,  నిమ్మ రసం, చిటికెడు అజినోమోటో,  వైట్ పెప్పర్, తగినంత కారం, ఉప్పు వేయాలి.ఇందులో గుడ్డు మిశ్రమం వేసుకుని పేస్ట్ ల చేసుకోవాలి.  అందులో చికెన్  ముక్కలు వేసి కలపాలి. తరువాత స్టవ్ వెలిగించి  పాన్ లో డీప్ ఫ్రై  కి నూనె పోసి వేడి చేసుకుని అందులో చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసిపక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ లో రెండు స్పూన్ల  ఆయిల్ వేసి  వేడి చేసి .అందులో పచ్చి మిరపకాయలు, కరివేపాకు, వేసి ఒక రెండు నిముషాల పాటు వేయించి అందులో రెండు కప్స్ నీళ్ళు పోసి మరిగించుకోవాలి. అందులో  చిల్లి సాస్, అర స్పూన్  సోయ్ సాస్,  అజినోమోటో చిటికెడు కొంచం పెప్పర్, తగినంత ఉప్పు వేసి కలిపి  చికెన్ ముక్కలు వేసి నీళ్ళు  ఇంకి పోయేంత వరకు  ఉడికించి చివరిలోనిమ్మ రసం వేసి కలిపితే చైనీస్ చికెన్ రెడీ