చికెన్‌ రోస్ట్‌ రెసిపి

 

 

 

కావలసినవి:
చికెన్‌- అర కేజీ
మిరియాలు-1  టేబుల్‌స్పూన్‌
కొత్తిమీర-1 కట్ట
నూనె-సరిపడా
ఉప్పు-తగినంతఉల్లిపాయ-1
టమాటా-1
కారం-1 స్పూన్‌
ధనియాల పొడి-1స్పూన్‌
పసుపు-అర స్పూన్
ఆవాలు -కొద్దిగా
అల్లం ముక్క పెద్దది -1
వెల్లుల్లి పాయలు-15 రెబ్బలు

 

తయారుచేసే విధానం:
 మిరియాలు, వెల్లుల్లి,అల్లం ను గ్రైండ్ చేసి  పెట్టుకోవాలి.చికెన్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత  స్టవ్  వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆవాలు , ఉల్లిపాయముక్కలు  దోరగా వేగనివ్వాలి. ఆ తరువాత టమాటాలు,  ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. కారం,  ధనియాల పౌడర్‌,పసుపు, వేసి కలపాలి. ఆ తరువాత చికెన్‌ వేసి సరిపడా  నీళ్ళు  ఉడికించాలి. పూర్తిగా ఉడికిపోయకా  స్టవ్ ఆఫ్ చేసుకుని కొత్తిమిర వేసుకోవాలి