చికెన్ టిక్కా బిర్యానీ

 

 

 

 

కావలసినవి:
బోన్ లెస్ చికెన్: 1కేజీ
కారం: 2 స్పూన్స్
బాస్మతి రైస్ :  1కేజీ
అల్లం పేస్ట్: ఒక స్పూన్
పెప్పర్ పౌడర్: ఒక స్పూన్
నిమ్మరసం: ఒక స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ : 3 స్పూన్స్
చెక్క:సరిపడా
ఉప్పు: తగినంత
నెయ్యి : 2 స్పూన్లు
నూనె : తగినంత
వెల్లుల్లి పేస్ట్: ఒక స్పూన్
పసుపు: అరస్పూన్
చాట్ మసాలా : ఒక స్పూన్స్
ఉల్లిపాయలు: 2
టమోటో: 2
పెరగు : 1 కప్పు
లవంగాలు: 5
ఫుడ్ కలర్ (Yellow) : 1/4tsp
కుంకుమ పువ్వు: చిటికెడు
పాలు: ఒకటిన్నర కప్పు
బిర్యానీ ఆకు : 2
యాలకులు: 4

 

తయారీ :
ముందుగా  పెద్ద గిన్నె తీసుకొని అందులో  చికెన్ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, చాట్ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేసి ఈ చికెన్ ను 2 గంటలపాటు  మ్యారినేట్ చేసి  ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత బియ్యాన్ని కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే  కప్పు వేడి  పాలల్లో   కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి, తరువాత టమోటో వేసి చిక్కటి గ్రేవి తయారయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి  నానబెట్టి పెట్టుకొన్న చికెన్ ముక్కలు కూడా వేసి10 నిముషాలు ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ పై పెట్టి బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి మరగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఉడికిన అన్నం ఒక లేయర్ చికెన్ ఒక లేయర్ గా వేసుకుని పైన చికెన్ లేయర్ వచ్చేలా చూసుకోవాలి. తరువాత కుంకుం పువ్వు వేసి నానపెట్టుకున్న పాలను ఈ లేయర్స్ మీద వేసుకుని స్టవ్ పై 5 లేక 10 నిముషాలు మూత పెట్టి ఆవిరిపై ఉడికించుకోవాలి....