చికెన్‌ శనగపప్పు కర్రీ రెసిపి

 

 

 

 

కావాల్సిన పదార్థాలు :

చికెన్‌ : ఒక కిలో
శనగపప్పు : పావు కిలో
కారం పొడి : రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు స్పూన్లు
ఉల్లిపాయ : ఒకటి
గరం మసాల : రెండు స్పూన్లు 
పసుపు : తగినంత
నూనె : తగినంత
కరివెపాకు : రెండు రెబ్బలు
కొత్తిమీర : రెండు స్పూన్లు

 

 

తయారు చేయు విధానం :
ముందుగా శనగపప్పును తీసుకుని ఓ గంటసేపు నానబెట్టాలి. తరువాత చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు సన్నగా కట్  కోవాలి. ఇప్పుడు  స్టవ్‌ వెలిగించి పాన్ పెట్టి  తగినంత నూనె పోసి ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లంవెల్లులి ముద్ద, కరివేపాకు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు వేసి వేగనివ్వాలి. కొద్దిసేపు తరువాత నానబెట్టిన  శనగపప్పును చికెన్‌లో వేసి ఉప్పు వేసి బాగా కలపాలి. (శనగపప్పు ఉడకదేమో అనుకుంటే దాన్ని ముప్పావ్ శాతం ఉడికించుకుని చికెన్ లో కలుపుకోవచ్చు)  కొద్దిగా ఉడికిన తరువాత గరంమసాల వేసి రెండు నిముషాలు ఉడికించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకుంటే శనగపప్పు చికెన్ రెడీ...