చికెన్ మంచూరియా
కావలసినవి:
చికెన్ (బోన్ లెస్) - పావుకేజీ
ఉల్లిపాయలు - రెండు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - అర టీ స్పూన్
పచ్చిమిర్చి - నాలుగు
కోడిగుడ్డు - ఒకటి
మైదాపిండి - చిన్న కప్పు
సోయాసాస్ - ఒక స్పూను
చిల్లీ సాస్ - కొద్దిగా
వెనిగర్ - ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను
టమోటా సాస్ - ఒక టీ స్పూన్
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడగాలి. తర్వాత చికెన్‌ను మిరియాల పొడి, కోడిగుడ్డు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, మిర్చి, కార్న్ ఫ్లోర్, తగినంత నీటితో కలిపి అరగంట పాటు ఊరనివ్వాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి చికెన్‌ను దోరగా వేపి ప్లేటులోకి తీసుకోవాలి. మరో పాత్రలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిర్చి పేస్ట్‌ను కలిపి బాగా వేపుకోవాలి. ఇందులో సోయాసాస్, టమోటా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ చేర్చి కాసేపు ఉడకనివ్వాలి. ఉడికాక ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ పీస్‌లను చేర్చి నాలుగు నిమిషాల పాటు వేయించాలి. అలాగే తగినంత ఉప్పు, కార్న్ ఫ్లోర్ చేర్చి హాట్ హాట్‌గా ఫ్రైడ్ రైస్, రోటీలకు సైడ్ డిష్‌గా సర్వ్ చేయాలి.