చికెన్ దమ్ బిర్యాని

(రంజాన్ స్పెషల్)

 

 

 

కావలసినవి :

చికెన్ - 1  కేజీ

బాస్మతీ బియ్యం - 1 కేజీ

ఉల్లిపాయలు - 1/2 కేజీ

పెరుగు - 1/2 లీటర్.

పచ్చిమిర్చి - 3

పసుపు - 1/4 టీస్పూన్

కారం పొడి - 1 టీస్పూన్

అల్లం-వెల్లుల్లి ముద్ద - 3 టీస్పూన్స్

కొత్తిమీర - 1/2 కప్పు

పుదీన - 1/2 కప్పు

ఎండు గులాబీ రేకులు - 3 టీస్పూన్స్

ఏలకులు - 6

లవంగాలు - 10

పాలు - 1/2 కప్పు

ఉప్పు - తగినంత

నూనె - సరిపడా

దాల్చిన చెక్క - 2 ముక్కలు

షాజీరా - 2 టీస్పూన్స్

గరంమసాలా పొడి - 1 టీస్పూన్

నిమ్మరసం - 1 టీస్పూన్

కుంకుమ పువ్వు - చిటికెడు


తయారీ విధానం :

ముందుగా నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా కరకరలాడేటట్టుగా వేయించి పెట్టుకోవాలి.

 

అలాగే తరిగిన కొత్తిమీర, పుదీనా, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిచుకోవాలి. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి.

 

వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కారంపొడి, పసుపు, నిమ్మరసం, ఎండిన గులాబీ రేకులు,  ఉప్పు వేసి గ్రైండర్లో మెత్తగా ముద్ద చేసుకోవాలి.

 

ఒక గిన్నెలో చికెన్ వేసి నూరిన ముద్ద, పచ్చి కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, గరంమసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి.

 

బియ్యం నీటిలో కడిగి అరగంట నాననివ్వాలి. 

 

తరువాత స్టవ్ వెలిగించుకుని మందపాటి గిన్నె తీసుకుని నూనె వేయాలి. నూనె కాగాక దానిలో నానబెట్టిన చికెన్ వేసి ఉడకనివ్వాలి.

 

ఇంకో గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా వేయాలి.

 

మరుగుతున్న నీటిలో నానపెట్టిన బియ్యం వేసి సగం ఉడకగానే జల్లెడలో వడకట్టి ఉడుకుతున్న చికెన్ పై సమానంగా పరవాలి. 

 

దానిపై ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, యాలకుల పొడి, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు అక్కడక్కడ వేసి, గిన్నెపై  మూత పెట్టాలి.

 

మూత చుట్టూ  ఆవిరి బయటకు పోకుండా తడిపిన గోధుమ పిండిని పెట్టాలి. అరగంట సన్నని మంట మీద ఉడకనివ్వాలి. బిర్యానీ మొత్తం ఆవిరి మీదే ఉడికిపోతుంది. 

 

అంతే నోరూరించే చికెన్ దమ్ బిర్యాని రెడీ!!!