అండు కొర్రల కిచిడీ
కావలసిన పదార్ధాలు:
పెసర పప్పు - అర కప్పు
ఉల్లి తరుగు - అర కప్పు
వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను
అండు కొర్రల రవ్వ - 1 కప్పు
తరిగిన పచ్చి మిర్చి - 4
ఉప్పు - తగినంత
తరిగిన టొమాటో - 1
అల్లం తురుము - అర టీ స్పూను
ఆవాలు - 1 టీ స్పూను
పసుపు - కొద్దిగా
నెయ్యి - ఒక టేబుల్ స్పూను
కరివేపాకు - 2 రెమ్మలు
తయారుచేసే విధానం:
ముందుగా స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి నెయ్యి వేసి కరిగించుకొని ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఉల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, వెల్లుల్లి తరుగు, టొమాటో తరుగు ఒకదాని తరవాత ఒకటి వేస్తూ పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు వేసి మరోమారు కలియబెట్టాలి. మూడు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగించాలి. పెసర పప్పు, అండు కొర్రల రవ్వ వేసి కలియబెట్టాలి. మంట బాగా తగించుకొని.... గిన్నె మీద మూత పెట్టి, మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతుండాలి. అంతే వేడి వేడి అండు కొర్రల కిచిడీ రెడీ.