బ్రెడ్ ఆమ్లెట్

 

 

కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లైసులు - 4
గ్రుడ్లు - 2
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
టొమాటో  - 1
కొత్తిమీర - 1 కట్ట
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - ¼ టీ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
టొమాటో సాస్ - 2 టేబుల్ స్పూన్స్

 

తయారుచేసే విధానం:

ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర సన్నగా తరగాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలోకి తీసుకొని పసుపు, ఉప్పు, మిరియాల పొడిని కలపాలి. దీనిలో గ్రుడ్లు వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి, నెయ్యి వేసి బ్రెడ్ స్లైసులు రెండువైపులా కాల్చాలి. కాల్చిన బ్రెడ్ స్లైసుల పైన కొద్దిగా టొమాటో సాస్ పూయాలి. తరువాత పెనం మీద కొద్దిగా నూనె వేసి, ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ కట్ చేసి బ్రెడ్ స్లైసుల మద్యలో పెట్టాలి. ఇది పిల్లలకు సాయంత్రం స్నాక్స్ గా బావుంటుంది.

 

- రమ