బీట్‌రూట్ బిర్యానీ
ఆరోగ్యాన్నిచ్చి కూరగాయాలలో బీట్ రూట్ కూడా ఒకటి. దీనితో కూరే కాదు... మసాలా దట్టించి మంచిగా బిర్యానీ కూడా చేస్తుకోవచ్చు.
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ - రెండు
బియ్యం - మూడు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
పుదీనా - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
పచ్చి మిరపకాయలు - ఆరు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ధనియాల పొడి - రెండు స్పూన్లు
గరం మసాలా - ఒక స్పూను
కారం - రెండు స్పూన్లు
పసుపు - చిటికెడు
మిరియాలు - కొద్దిగా
మసాలా ఆకు - నాలుగు
ఉప్పు, నూనె - తగినంత
తయారుచేసే విధానము:
ముందుగా నీళ్ళల్లో బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. తరువాత బీట్‌రూట్‌ని తురుముకోవాలి.
ఒక గిన్నెలో తగినంత నూనె పోసుకొని వేడి అయ్యాక అందులో మసాల ఆకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి.
అందులో బీట్‌రూట్, అల్లం వెల్లుల్లి వేసి మరో ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాల పొడి, కారం, పసుపు, మిరియాలు, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
వేగాక అందులో నానబెట్టిన బియ్యాన్ని వేసి రెండు నిముషాల పాటు వేయించి అందులో సరిపడా నీళ్ళు పోసి మీడియం మంట మీద అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే బీట్‌రూట్ బిర్యానీ రెడీ.