బ్లాక్ రైస్ ఇడ్లీ
కావాల్సిన పదార్థాలు:
నల్ల బియ్యం- పావు కప్పు
మినపపప్పు -1/2 కప్పు
మెంతులు-చెంచా
ఉప్పు-రుచికి సరిపడా
కావాల్సినంత నీరు
తయారీ విధానం:
ముందుగా నల్లబియ్యం, మెంతులు, మినపపప్పు విడిగా కడిగి 6 గంటలు నానబెట్టాలి. తర్వాత వాటిని రుబ్బుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు వేసి 8గంటలపాటు పులియనివ్వాలి. ఇడ్లీ ప్లేట్లపై నూనె రాసి ఇడ్లీ పిండిని పోయాలి. పది నిమిషాలు ఆవిరి మీద ఉంచాలి. కొబ్బరి చట్నీ, సాంబార్ తో కానీ వేడి వేడిగా వడ్డించుకుని తింటే చాలా సూపర్బ్ టేస్ట్ ఉంటుంది.