ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పులావ్ రెసిపి
కావలసిన పదార్థాలు:
చికెన్: 1/2kg
బాస్మతి రైస్: 2cups
చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 5-6
యాలకులు: 2
స్టార్ ఆనిస్: 1(మసాలా మొగ్గ)
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉల్లిపాయలు: 2(సన్నగా కట్ చేసుకోవాలి)
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లిపాయలు: 6-10
పచ్చిమిర్చి: 4-6
కారం: 1tsp
పసుపు: 1/2tsp
ధనియాలపొడి: 1tsp
నిమ్మరసం: 1tsp
కొబ్బరి పాలు: 1/2cup
నూనె: సరిపడా
నెయ్యి: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాన్ స్టౌ మీద పెట్టి వేడయ్యాక అందులో చెక్క, లవంగాలు, యాలకులు, మరాటి మొగ్గ వేసి లైట్ గా వేయించాలి.
2. తర్వాత అందులో కరివేపాకు వేసి ఒక నిముషం అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కులు వేసి మరో ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించాలి.
3. అంతలోపు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
4. వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో శుభ్రం చేసుకొన్న చికెన్ ముక్కలను వేసి, ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి.
5. తర్వాత అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసి బాగా కలియ బెట్టాలి. తర్వాత మూత పెట్టి మంట మీడియంగా పెట్టి మరో పది నిముషాల పాటు ఉడికించుకోవాలి .
6. పది నిముషాల తర్వాత మూత తీసి అందులో కారం, పసుపు చిలకరించి చికెన్ మిశ్రమంతో బాగా కలపాలి. అలాగే నిమ్మరసం కూడా కలిపి రెండు మూడు నిముషాల పాటు ఉడికించాలి.
7. తర్వాత అందులోనే కొబ్బరి పాలు పోసి, వెంటనే శుభ్ర చేసి కడిగి పెట్టుకొన్న బాస్మతి రైస్ ను కూడా చేర్చి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి పది-పదిహేను నిముషాల తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
అంతే ఆంధ్ర స్టైల్ చికెన్ పులావ్ రెడీ. చికెన్ పులావ్ ను రైతా లేదా పెరుగు ఉల్లిపాయ ముక్కలతో వేడి వేడిగా సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది. సర్వ్ చేసే ముందు పుదీనా, కొత్తిమీరతరుగుతోగార్నిష్ చేసిసర్వ్ చెయాలి......