ఆంధ్ర చేపల పులుసు

కావాల్సిన పదార్ధాలు:

చేప మసాలా పొడి కోసం

ధనియాలు - ఒక టేబుల్ స్పూన్

ఎండుమిర్చి - ఏడు

మెంతులు - అర టేబుల్ స్పూన్

వెల్లులి - 8 లేక10 రెబ్బలు

పులుసు కోసం:

చేప ముక్కలు - 300 గ్రా

నూనె - అర కప్పు

కరివేపాకు - రెండు రెబ్బలు

ఉల్లిపాయలు - రెండు

పచ్చిమిర్చి - నాలుగు

అల్లం వెల్లులి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

పసుపు - అర టేబుల్ స్పూన్

కారం - ఒక టేబుల్ స్పూన్

ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూన్

టొమాటో ముక్కలు - పావు కప్పు

నీళ్ళు - అర లీటర్

50 గ్రాముల చింతపండు నుంచి తీసిన పులుసు 200 ఎంఎల్

కొత్తిమీరా – చిన్న కట్ట

తయారీ విధానం:

మసాలా పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేదాకా వేయించాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకోని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి . మూకుడులో నూనె వేసి అందులో కరివేపాకు, రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ ను వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుతూ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లులి ముద్ద కూడా వేసి వేపుకోవాలి. అవి వేగాక పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేపుకోవాలి. ఆ తరువాత రెడీ చేసుకున్న చింతపండు పులుసు, నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మరుగుతున్న పులుసులో చేప ముక్కలు వేసి సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మరగనివ్వాలి. 15 నిమిషాలకి నూనె తేలి పులుసు చిక్కబడుతుంది. అప్పుడు కొత్తిమీర తరుగు, చేపల మసాలా పొడి వేసి నెమ్మదిగా ముక్క చిదరకుండా కలిపి మరో 5 నిమిషాలు సన్నని సెగ మీద మరిగిస్తే ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ.