EVENTS
ది హాంగ్‌కాంగ్‌ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకలు



హాంగ్‌కాంగ్‌లోని "ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య" ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన మన్మథ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ది గ్రాండ్ ప్రోమనేడ్, సై వాన్ హోలో జరిగిన ఈ వేడుకలకి హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న దాదాపు 100 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు.

 

 

ఈ వేడుకలకి, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా హాంగ్‌కాంగ్ శాఖ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీమతి & శ్రీ వెంకట్ చలసాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ సందర్భంగా హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య వారి వార్షిక పత్రిక ‘స్ఫూర్తి’ 2015 సంచికను వెంకట్ చలసాని ఆవిష్కరించారు.



ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య  తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడి  ప్రజలకు పరిచయం చేయడం కోసం పది సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి, దినదిన ప్రవర్ధమానమవుతున్న సంస్థ. ఈ సంస్థలో ప్రత్యేక కమిటీలు అంటూ ఏవీ వుండవు. అందరూ స్వచ్ఛంద సేవకులే. ఇది ఈ సంస్థ ప్రత్యేకత. ఇది తెలుగు ప్రజలచే, తెలుగువారికోసం ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థకు శ్రీమతి జయ పీసపాటి నాయకత్వం వహిస్తున్నారు.


శ్రీమలి జయ ఇక్కడ నివసిస్తున్న తెలుగువారి పిల్లలకు మాతృభాషను నేర్పించడం కోసం సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు  నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హాంగ్‌కాంగ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు ప్రతి ఏటా ఉగాది, కార్తీక వనభోజనాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకుంటారు.

 



దేశంకాని దేశంలో నివసిస్తూ కూడా మన తెలుగుజాతి ఔన్నత్యాన్ని, విలువలను భావి తరాల వారికి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను నేర్చుకోవాలని అనుకునే ఔత్సాహికులకు తెలియజేస్తూ ‘ది హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య’ ముందుకు వెళ్తోంది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;