ARTICLES
హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు

గత కొన్ని సంవత్సరాలుగా హాంగ్ కాంగ్ లో 15 శాతం తెలుగువారు పెరిగారు. దీనికి కారణం పీసపాటి జయ చేసిన కృషి నిరంతరం హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య గురించే ఆలోచించే జయ హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అభివృద్ధి కోసం, తెలుగువారందరినీ ఓకే గొడుగు క్రిందకు రావాలని గ్రూప్ ఈమెల్స్ ద్వారా, పేస్ బుక్ లో వెబ్ సైట్ ద్వారా ప్రచారం చేసారు.

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు

 

 

 

 

 

 

 

యిరుకైన అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మన తెలుగువారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పచ్చని లాన్స్ లో, సముద్రంపై నుండి వచ్చే నులివెచ్చని గాలి వొళ్ళు పులకరిస్తుండగా చక్కటి భారతీయ వంటకాలతో ఎంతో ఆనందంగా జరుపుకున్నారు.

 

హాంగ్ కాంగ్ లో మొదరి తెలుగు డాన్స్మ్ యోగా మాస్టర్ అయిన రాన్జేంద్ర న్యాటి దీపప్రజ్వలనతో ప్రారంభమైంది. మాస్టర్ హరి ఓమ్. శ్రీమతి పీసపాటి జయ మరియు శ్రీమతి కవిత బొప్పన “మా తెలుగు తల్లికి’’ పాటతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పీసపాటి జయ నిర్వహణలోని బాలానందం పిల్లలు “శుక్లాంబరధరం’’, “గురుబ్రహ్మ ... గురువిష్ణు’’, వందేమాతరం జాతీయగీతాలు ఆలపించారు.

 

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు

 

 

 

 

 

 

 

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య పిల్లలు అనీష్ రెడ్డి, వెన్యాట మన్నే, సాహితి పీసపాటి, సాత్విక కలిదిండి, సాయి కీర్తన సురే, రహిత, హర్షిత రేనిగుంట్ల, సుసన్న, సంజన బాంబే, సాన్వి దుర్భాక, నిఖిత అట్టలురి భక్తిగీతాలు పాడి, సినిమా పాటలు, జానపద నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. వీరి ఆటపాటలకు ప్రేక్షకులలోని పిల్లలు కూడా స్ఫూర్తి చెంది వారు కూడా నృత్యాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే అత్యధికంగా డాన్స్, యోగా గురువులు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య లో ఉన్నారని గర్వంగా చెప్పారు. వీరికి తోడు డీ-3 విజేత సత్య కోట్ల కూడా వీరికి జతయ్యారని తెలిపారు.

 

సత్య కోట్ల చేసిన అత్యద్భుత నృత్యంకి తోడు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న డాన్స్ మాస్టర్ మరియు తెలుగు సినిమా దర్శకుడు శ్రీ కిశోర్ జతకట్టారు. మాస్టర్ ప్రవీణ్ కండరాలకు సంబంధించిన కొన్ని యోగాసనాలను వేసి ప్రేక్షకులకు చూపించారు.

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు

 

 

 

 

 

 

 

అందమైన వస్త్రధారణలో, అందమైన ఆభరణాలతో మాస్టర్ హరి ఓమ్ డాన్స్ సొసైటీ పిల్లలు కూచిపూడి నృత్యాలు, హైదరాబాద్ నివాసి ప్రస్తుతం హాంగ్ హాంగ్ లో పనిచేస్తున్న మాస్టర్ ఉదయ్ సతల వారి శిష్యుల నృత్యాలు, మాస్టర్ జగన్ కథక్ డాన్స్, సాంప్రదాయక దుస్తులలో హైదరాబాద్ వాసి, హాంగ్ కాంగ్ డాన్స్ మాస్టర్ వారి శిష్యులు నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. మాస్టర్ హరి కృష్ణ నృత్య దర్శకత్వంలో హాంగ్ కాంగ్ ఆడపడుచులు ఇందు రెడ్డి, కవిత బొప్పన, ప్రశాంతి కోరపటి, ఉషా నల్లూరి, కలుసుకోవాలని తెలుగు చిత్రంలోని ఆకాశం అనే పాటకు చేసిన నృత్యం వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

 

ఆంద్రప్రదేశ్ డాన్స్ మాస్టర్స్ మరియు వారి శిష్యుల క్లాసికల్, సెమీ క్లాసికల్ ఇతర డాన్స్ స్టైల్ లో కనీసం తెలుగు లేక హిందీ భాషలు మాట్లాడలేని, అర్థం చేసుకోలేని చైనీస్ పిల్లలు చేసిన నృత్యాలు ఈ వేడుకలలో హైలైట్ గా నిలిచాయి.

శ్రీమతి పీసపాటి జయ తమ ఓట్ ఆఫ్ థాంక్స్ లో మాట్లాడుతూ యువతకు మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండాలని, ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కటిరికి ధన్యవాదములను తెలిపారు. బాలానందం పిల్లలు పాడిన జాతీయగీతంతో ఈ వేడుకలు ముగిశాయి.

హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆద్వర్యంలో ఉగాది ఉత్సవాలు

TeluguOne For Your Business
About TeluguOne
;