MEMORIES
యువరత్న బాలకృష్ణ ముఖ్య అతిథిగా తాల్ ఉగాది వేడుకలు

తెలుగుగడ్డ గర్వించదగ్గ మన అన్న N.T.R. తనయుడు నందమూరి అందగాడు, యువరత్న బాలకృష్ణ ముఖ్య అతిథిగా తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) 8వ ఉగాది వేడుకలు వైభవోపేతంగా కన్నుల పండుగగా మార్చి 31న లండన్ లోని fairlopలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా విచ్చేసిన బాలయ్య, ప్రముఖ జానపద కవి గోరేటి వెంకన్న, కవులు వాసిరెడ్డి నవీన్, శివారెడ్డి గార్లతో పాటు ఆహుతులను తమ మంత్ర ముగ్ధగానంతో అలరించడానికి నంది అవార్డు గ్రహీత గాయని మాళవిక, ప్రముఖ గాయకుడు శ్రీకృష్ణ కూడా విచ్చేశారు. మరి ఈ హేమాహేమిలైన అతిథుల గురించి ఆహుతులకు చెప్పడానికి మరియు వారిచేత వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి మా టీవి యాంకర్ అశ్విని కూడా విచ్చేసింది.

tal ugadhi vedukalu, tal ugahi vedukalu 2012, chief chief guest nandamuri balakrishna, tal 8th ugadhi vedukalu 2012 march 31, tal ugadhi vedukalu 2012, tal yuvaratna balakrishna chief guest,nri news, telugu nri news

ఇకపోతే మరి ఉగాది పర్వదినం జరుపుకుంటున్నవేళ పచ్చడి, పంచాగ శ్రవణం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి....? గత 8 సంవత్సరాలుగా లండన్లో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు నడుంకట్టిన తాల్, ప్రతియేటా ఉగాదిని ఘనంగా మరియు సాంప్రదాయ బద్ధంగా సంస్కృతిక, భాష అంశాలను మేళవిస్తూ నిర్వహిస్తుంది. అదేక్రమంలో, ఈ యేడు కూడా భాషా, సంప్రదాయ, సాంస్కృతిక, వినోదభరిత కార్యక్రమాలతో ఆద్యంతం సాగింది. 8వ తాల్ ఉగాది వేడుకలు తాల్ చైర్మన్ శ్రీధర్ వనం హాజరైన వారిని స్వాగతించి, ఇటీవల దుర్మరణం పాలైన రాజకుమార్ కు సంతాపం తెలిపారు. ఆ తరువాత పద్మశ్రీ ఈమణి శంకరశాస్త్రిగారి మనవరాలైన శ్రీమతి. పద్మిని పాడిన గణేశ స్తుతితో మొదలై, యాదాటి శర్మ గారి పంచాంగ శ్రవణం, స్మిత & claire చేసిన Fusion Dance, సుష్మిత & ఐశ్వర్య చేసిన జానపద నృత్యం, సినీ సంగీతం, శృతి- లయ bollywood నృత్య బృంద నృత్యాలతో ఆహుతులను ఆకట్టుకున్నాయి.

tal ugadhi vedukalu, tal ugahi vedukalu 2012, chief chief guest nandamuri balakrishna, tal 8th ugadhi vedukalu 2012 march 31, tal ugadhi vedukalu 2012, tal yuvaratna balakrishna chief guest,nri news, telugu nri news

ఈ యేడు ఉగాది వేడుకలలో ప్రత్యేక ఆహ్వానితులైన గాయకుడు గోరేటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతోంది అంటూ జానపదంలో పల్లె పరిస్థితులను మనకు వివరించారు. దీనికి వైవిధ్యంగా ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు ప్రపంచ ప్రఖ్యత వయోలినిస్టు శ్రీమతి. జ్యోత్స్న గారు తమ బృందంతో fusion-జుగల్ బంది సంగీతం ఆహుతులను మరియు ముఖ్య అతిథి నందమూరి బాలకృష్ణలను అబ్బురపరిచాయి. సాయినీమ మరియు సుశమ్నలు తమ భారతనాత్యంతో అలరించగా, మాళవిక & శ్రీకృష్ణలు తమ గాన మాధుర్యంతో ఆహుతులను ముంచెత్తారు.

tal ugadhi vedukalu, tal ugahi vedukalu 2012, chief chief guest nandamuri balakrishna, tal 8th ugadhi vedukalu 2012 march 31, tal ugadhi vedukalu 2012, tal yuvaratna balakrishna chief guest,nri news, telugu nri news

ఆ తరువాత ముఖ్య అతిథి, ప్రత్యేక అతిథులను తాల్ చైర్మన్ వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు. ప్రత్యేక అతిథి అయిన redbrige మేయర్ Christopher Cummins మాట్లాడుతూ, తెలుగు భాషను, తెలుగు భాషకు తాల్ చేస్తున్న సేవలను కొనియాడారు. C.P. Brown సమాధిని పునరుద్ధరించినందుకు తాల్ ను అభినందించారు. ప్రత్యేక అతిథిగా Indian High Commission First Secretary Mr. Tarachand హాజరయ్యారు. తాల్ వైస్ చైర్మన్ మహేష్ చదలవాడ & సాంస్కృతిక కార్యదర్శి రాజరెడ్డి మ్యాకల, గోరెటి వెంకన్నను సభకు పరిచయం చేసి, తాల్ తరపున సన్మానించి, తగ యేడాది ప్రకటించిన TAL Cultural Excellence అవార్డును అందజేశారు. గోరెటి గారు మాట్లాడుతూ, గత యేడాది అనివార్య కారణాల వల్ల రాలేకపోయానని, తాల్ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని కొనియాడారు. “పల్లెలు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాము" అని సభాముఖంగా పునరుద్ఘాటించారు.

tal ugadhi vedukalu, tal ugahi vedukalu 2012, chief chief guest nandamuri balakrishna, tal 8th ugadhi vedukalu 2012 march 31, tal ugadhi vedukalu 2012, tal yuvaratna balakrishna chief guest,nri news, telugu nri news

ఆ తరువాత చైర్మన్ శ్రీధర్ వనం తాల్ ప్రతిష్టాత్మక అవార్డు Lifetime Acheivement Award ను పొందిన Dr. S.Y.P.C. ప్రసాదరావు ను తాల్ ట్రస్టీలు సూర్యా, మల్లేష్, సంజయ్ మరియు secretaries రవి మోచర్ల, ధర్మవతి, రాజారెడ్డి గిరిబాబు, హరిప్రసాద్, శ్రీదర్ సమకషంలో వేదికపైకి ఆహ్వానించి సభకు పరిచయం చేశారు. తరువాత ముఖ్య అతిథి నందమూరి బాలకృష్ణ గారు LTA ను SYPC Prasad గారికి ప్రదానం చేశారు. తరువాత సంక్రాంతి ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు, TPL Franchise Owners కి Certificates అందజేశారు. తాల్ వార్షిక ఉగాది ప్రత్యేక సంచిన "మా తెలుగు" ను ఆవిష్కరించారు.

tal ugadhi vedukalu, tal ugahi vedukalu 2012, chief chief guest nandamuri balakrishna, tal 8th ugadhi vedukalu 2012 march 31, tal ugadhi vedukalu 2012, tal yuvaratna balakrishna chief guest,nri news, telugu nri news

తరువాత ముఖ్య అతిథి నందమూరి బాలకృష్ణను ఘనంగా సన్మానించి ఈ యేడు TAL Cultural Excellence Award ని ప్రధానం చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగు వారు అనేక రంగాలలో రాణించి ఇక్కడ ఏకమై ఉగాది ఉత్సవాలను జరుపుకుంటునందుకు మరియు నా అభిమానులను ఈ విధంగా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

తెలుగువారి ఆరాధ్యుడు, వారి పితృదేవుడు N.T.R.వారి మాతృమూర్తి జ్ఞాపకార్ధంగా, పేదలకు సేవచేయాలనే సంకల్పంతో నిర్మించిన Basavataarakam indo-american cancer trust మరియు వాటి కార్యక్రమాలను వివరించారు. ఇతోధికంగా ఈ సేవా కార్యక్రమానికి సహాయాన్ని అందించాలని ఆహుతులను కోరారు. ప్రజల కోరిక మేరకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి నా ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవచేస్తానని పునరుద్ఘాటించారు.

tal ugadhi vedukalu, tal ugahi vedukalu 2012, chief chief guest nandamuri balakrishna, tal 8th ugadhi vedukalu 2012 march 31, tal ugadhi vedukalu 2012, tal yuvaratna balakrishna chief guest,nri news, telugu nri news

తరువాత బాలయ్య తనదైన శైలిలో తన సినిమా డైలాగులతో సభను దద్దరిల్లజేశారు. జై బాలయ్య జై బాలయ్య అనే అభిమానుల నినాదాలతో సభ మార్మోగింది. ఈ కార్యక్రమం విజయాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి సమాచార శాఖామాత్యులు, UK ఉప ప్రధాన మంత్రి, UK సాంస్కృతిక శాఖామాత్యులు మరియు ఇతర అధికారులు, మంత్రులు వారి శుభాబినందనలు పంపారు.

ఈ సందర్భంగా తాల్ కోశాధికారి, కందుకూరి సూర్య, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయానికి తోడ్పడిన sponsors (Shakthi swathi, taste of India, UAEE change, Financial Partners, SR Info systems, Panjab National Bank, HDFC), volunteers, తాల్ ట్రస్టీలు, కార్యవర్గ సభ్యులకు, మరియు విచ్చేసిన ఆహుతులకు ధన్యవాదాలు తెలిపారు.

TeluguOne For Your Business
About TeluguOne
;