INTERVIEWS
జాక్ సన్ విల్ తెలుగు సంఘం ఉగాది వేడుకలు

జాక్సన్ విల్లా ఎఫ్.ఎల్. : జాక్ సన్ విల్ తెలుగు సంఘం (TAJA) వారు శ్రీఖర నామ సంవత్సర ఉగాది వేడుకలు మే 14వ తేదీన స్థానిక ల్యాండ్ మార్క్ హైస్కూల్ లో ఎంతో ఘనంగా జరిగాయి. ఆ రోజు కురిసిన చిరు జల్లులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన 700 మందికి ఎండల నుండి ఉపశమనం కలిగించగా చిన్నారులు, పెద్దలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల మనసుకెంతో ఆహ్లాదాన్ని కలిగించాయి.

 

TAJA గౌరవ అధ్యక్షులు శ్రీ వెంకట్ పాములపాటి దంపతులు జ్యోతి వెలిగించి ప్రారంభించగా స్థానికి అర్చకులు శ్రీ ప్రకాష్ పుదుకోడి గారు పంచాంగ శ్రవణం గావించారు. సుమారు 180 మందికి పైగా పిల్లలు, పెద్దలు అనేక శాస్త్రీయ, జానపద మరియు ఆధునిక నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. వేద పఠనం, కూచిపూడి వంటి సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు నేటి సినిమా పాటలనే కాకుండా, నాటి తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని గుర్తు చేసే పాటలకు చిన్నారులు చేసిన నృత్యం అభినందనీయం.

 TAJA అధ్యక్ష్యులు శ్రీ వెంకట్ పాములపాటి గారు గత సంవత్సరంలో కమిటి చేపట్టిన పలు సాంఘిక-సంక్షేమ, సాంస్కృతిక కార్యక్రమాల గురించి వివరించారు. తరువాత నూతన అధ్యక్షులు శ్రీ కీర్తిధర్ చెక్కిల గారు కొత్తకమిటీ సభ్యులను పరిచయం చేశారు. TAJA నిర్వహించిన పలు క్రీడాపోటీలలో క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ మరియు బౌలింగ్ విభాగాలలో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. నేను జరిగిన కార్యక్రమాలకు కొరియోగ్రఫీ మరియు కోఆర్డినేటర్ గా వ్యవహరించిన వారందరకు జ్ఞాపికలను అందజేశారు.

 

కార్యక్రమానికి స్పాన్సరర్ లుగా వ్యవహరించిన శ్రీ జే.పటేల్ (ఇండియన్ గ్రాసరీస్), శ్రీ రమేష్ (హౌస్ ఆఫ్ స్పీసీస్), శ్రీ ఖైజర్ (అప్నా బజార్) మరియు శ్రీ శేషగిరి (ప్రుడెన్షియల్) గార్లకు, పసందైన ఆంధ్రాభోజనం అందించిన ఫ్లేవర్స్ రెస్టారెంట్ వారికి, అలాగే ఈ కార్యక్రమం ఘనంగా జరపడానికి కృషి చేసిన వాలంటీర్లకు, స్టేజ్ ను సాంప్రదాయ రీతిలో అలంకరించిన శ్రీమతి భాగ్య శంక, విజయశ్రీ గార్లకు, యాంకర్ గా కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ రఘు సగిలి గారికి, వాలంటీర్లుగా ఎంతో కృషి చేసిన శ్రీ సాయి విశ్వనాథ్ గారికి, శ్రీమతి మంజరీ గోకుల్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

 

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన శ్రీమతి వాస్తి ఏలేటి గారికి, వారికి సహకరించిన శ్రీ భాను ఉప్పలపాటి, శ్రీనివాస్ పచ్చా, శ్రీ సుధీర్ కొండబ్రోలు, శ్రీ నాగభూషణం వెంగలపూడి, శ్రీ విష్ణు సరిదెన, శ్రీ లెనిన్ గుంతుం శ్రీమతి శిరీష పులి, శ్రీమతి సాహితి ఆటూరి మరియు శ్రీ నరేష్ గూటూర్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో స్టాల్ ను ఏర్పరచినందుకుగాను విజయశ్రీ జువలర్స్, కరాటే అమెరికా, ఆలోహ మైండ్ & మ్యాథ్, ఎయిమ్ రియాల్టీ & మేనేజ్ మెంట్, పరితా సెలూన్ & డే స్పిన్ లకు కృతజ్ఞతలు తెలిపారు.


TeluguOne For Your Business
About TeluguOne
;