KIDS TALENT
Deepavali Vedukalu by TAGCA

 దసరా, దీపావళి వేడుకలను అమెరికాలోని షార్లెట్‌లో తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షార్లెట్(టీఏజీసీఏ) ఆధ్వర్యంలో అక్టోబర్ 29 న జరిగిన ఈ సంబరాల్లో సుమారు 800 కి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 130 మంది బాల, యువ కళాకారులు పలు ప్రదర్శనలలో పాల్గొన్నారు.  TAGCA  సహాయ అద్యక్షులు శ్రీమతి పెళ్లూరు మణి గారు, కార్యవర్గం సభ్యులు శ్రీమతి సునీత అనుగు గారు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సుమారుగా నలభై  మంది చిన్నారులు పాడిన భక్తిగీతంతోమొదలయ్యింది. 

 

టీఏజీసీఏ అధ్యక్షులు పురుషోత్తమ చౌదరి గారు మాట్లాడుతూ తగ్కా ను ముందుకు తీసికెళ్ళడంలో కార్యవర్గ సభ్య్లులు, స్వచ్ఛ౦ద సేవకులు కీలక పాత్ర వహించారన్నారు.  తగ్కా ఈ సంవత్సరము సంక్రాంతి, బ్లడ్ డ్రైవ్, ఉగాది వేడుకలు, వనభోజనాలు, సంగీత విభావరి, మరియు దసరా సంబరాలు ఇలా ఆరు వైవిధ్యమైన కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించిందన్నారు. ఐదు సంవత్సరముల క్రితం పద్దెనిమిది మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ ఈ నాడు ఐదు వందల మంది సభ్యులున్నారని ఆయన హర్షం వ్యక్తం చేసారు. జనరల్ సెక్రటరీ శశి కాంత్ సుంకర గారు వందన సమర్పణ చేశారు. కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు,కొరియోగ్రాఫర్ లకు, పేరు పేరునా ధన్యవాదములు తెలియచేశారు. వారు పిల్లలను తెలుగు నేర్చుకోవలసినదిగా ప్రోత్సహించారు.

అనంతరం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించించాయి.అను పన్నెం రూపకల్పన చేసిన “శివ భక్తులు” ప్రేక్షకుల విశేషాదరణ పో౦దింది.స్వీయ నృత్య దర్సకత్వంలో చిన్నారులు రూపకల్పన చేసిన "ఎ న్ ర్ స్వర్ణ మాల' ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.రాణి పర్వతనేని నృత్య దర్శకత్వం వహించిన "డాన్సు మెడ్లీ" ప్రేక్షకాదరణ పొందింది.శ్రీమతి పల్లవి మదబూషి గారు రూపకల్పన చేసిన అయిగిరినందిని పలువురి ప్రశంస లందుకుంది.జ్యోతిర్మయి కొత్త గారు రచించిన  “అమ్మమ్మగారు అమెరికా ప్రయాణం” నాటిక సందేశాత్మకంగా ఉంది.

 టీఏజీసీఏ సభ్యులు సుంకర శశికాంత్, మణి పెళ్లూరు, సురేష్ చలసాని, జ్యోతిర్మయి కొత్త, రమణ అన్నె, మహేందర్ మాధవరం, సంజీవరెడ్డి పప్పిరెడ్డి, సచీంద్ర ఆవులపాటి, సునీత అనుగు, శ్రీనివాస్ అమర, నాగభూషణం నల్ల, శ్రీధర్ మంజిగాని తదితరులు వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;